Sarad pawar: పెద్దపార్టీ బీజేపీయే... కానీ పీఎం నరేంద్ర మోదీ కాదు: శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలు కావాల్సిందే
  • మోదీని ప్రధానిగా మిత్రపక్షాలు అంగీకరించవు
  • ఎన్సీపీ అధినేత శరద్ పవార్

రానున్న లోక్ సభ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, అయితే, మరోసారి ప్రధాని పదవి నరేంద్ర మోదీని వరించబోదని ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీ పెద్ద పార్టీ అయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, మిత్రపక్షాల మద్దతు అవసరం అవుతుందని, మోదీని ప్రధానిగా చూసేందుకు మిత్రపక్షాలు సిద్ధంగా లేవని ఆయన అన్నారు.

ఇటీవల తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని శరద్ పవార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీని అడ్డుకునేందుకు ఏర్పడిన మహాకూటమిపై 14, 15 తేదీల్లో మరింత స్పష్టత వస్తుందని అన్నారు. మహారాష్ట్రలో కూటమి నుంచి చిన్న పార్టీలు తప్పుకోవడంపై స్పందించిన ఆయన, కొన్ని పార్టీలు పోతే, మరికొన్ని పార్టీలు వచ్చి కలుస్తాయని అన్నారు. కాంగ్రెస్ నుంచి హామీ లభిస్తే, పీడబ్ల్యూపీ, స్వాభిమాన్‌ షెట్కారీ సంఘటన్‌ వంటి పార్టీలు కలుస్తాయని అన్నారు.

More Telugu News