Gift cap: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు ఇక గిఫ్ట్‌గా రూ.25 వేలు తీసుకోవచ్చు!

  • బహుమతి పరిమితి రూ. 5 వేల నుంచి రూ.25 వేలకు పెంపు
  • రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం
  • ఉద్యోగుల కండక్ట్ రూల్స్‌ను సవరించిన పళని ప్రభుత్వం

ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై గిఫ్ట్‌గా తీసుకునే మొత్తాన్ని రూ.5 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కండక్ట్ రూల్స్ 1973ని సవరించింది. గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఈ నెల 5న ఈ సవరణ చేసింది.

ప్రభుత్వం తాజా సవరణతో గ్రూప్ ఎ, బి, సి, డిలలో ఉన్న ఉద్యోగులు ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నుంచి ఇకపై రూ.25 వేలకు మించకుండా బహుమతిగా అందుకోవచ్చు. ఇప్పటి వరకు ఇది రూ.5 వేలకే పరిమితం.

అలాగే గ్రూప్ ఎ, బి, సి, డిలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణం తీసుకోవచ్చని పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. అయితే గ్రూప్ బి, సి, డి కేటగిరీలో ఉన్న ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి రూ.3 లక్షలకు మించి వడ్డీ లేని రుణం తీసుకోవడానికి వీల్లేదని పేర్కొంది.

More Telugu News