India: ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్.. బోయింగ్ విమానాలకు భారత్ రెడ్ సిగ్నల్

  • ఇథియోపియా ప్రమాదంతో ఉలిక్కి పడిన భారత్
  • బోయింగ్ విమానాల భద్రతపై కలవరం
  • పూర్తిస్థాయి మార్పుల తర్వాతే విమానాలు కదులుతాయన్న పౌరవిమానయాన శాఖ

ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది దుర్మరణం పాలయ్యాక భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల రాకపోకలను రెండు రోజుల పాటు నిషేధించింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఆదివారం ఇథియోపియాలో ప్రమాదానికి గురైంది బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానమే. బోయింగ్ విమానాలు వరుసపెట్టి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డీజీసీ మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ విమానాలకు పూర్తిస్థాయిలో మార్పులు చేయడంతోపాటు భద్రతా పరమైన చర్యలు తీసుకున్న తర్వాతే బోయింగ్ విమానాలు మళ్లీ కదులుతాయని పౌరవిమానయాన శాఖ తెలిపింది.

More Telugu News