YSRCP: కన్నీటి పర్యంతమైన వైసీపీ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్.. క్షమించాలంటూ వేడుకోలు

  • జగన్‌ను కలిసేందుకు మూడు రోజులుగా లోటస్ పాండ్ వద్ద పడిగాపులు
  • లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న భద్రతా సిబ్బంది
  • తప్పు చేసి ఉంటే క్షమించాలంటూ కార్యకర్తలకు వీడియో సందేశం
పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ అధినేత జగన్‌ను కలిసేందుకు హైదరాబాద్‌లోని జగన్ నివాసమైన లోటస్‌పాండ్ వద్ద భార్యతో కలిసి పడిగాపులు కాస్తున్న సునీల్‌కు చేదు అనుభవమే ఎదురైంది. ఆయనను లోపలికి వెళ్లకుండా గేటు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో సునీల్ మాట్లాడుతూ.. తనకు వైసీపీ టికెట్ దక్కే అవకాశం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డానని పేర్కొన్నారు. తను ఎటువంటి తప్పు చేయలేదని, తెలియక ఏదైనా చేసి ఉంటే క్షమించాలంటూ కార్యకర్తలకు పంపిన వీడియో సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  
YSRCP
Putalapattu
Chittoor District
MLA Sunil
Jagan

More Telugu News