Chandrababu: అనంతలో వైసీపీకి ఎదురుదెబ్బ.. పాటిల్ కుటుంబం రాజీనామా.. 18న టీడీపీలో చేరిక

  • జగన్‌కు భారీ షాక్
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్టు పాటిల్ ప్రకటన
  • టీడీపీకి అదనపు బలమన్న మంత్రి కాల్వ

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలోని ప్రధాన పార్టీలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ టికెట్ ఆశించి భంగపడిన వారు, టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్న వారు ‘జంప్ జిలానీ’లుగా మారిపోతున్నారు. ముఖ్యనేతలు సైతం పార్టీకి బైబై చెప్పేసి ప్రత్యర్థి పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా, అనంతపురం సీనియర్ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి జగన్‌కు భారీ షాకిచ్చారు.

తనతో సహా కుటుంబం మొత్తం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు.  అంతేకాదు, ఈ నెల 18న అనంతపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్టు తెలిపారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు,  పాటిల్ తనయుడు  అజయ్‌కుమార్‌రెడ్డి, సోదరుడు సదాశివరెడ్డి పల్లేపల్లిలోని తమ నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

గత ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఎప్పుడూ ప్రతీకార చర్యలకు పాల్పడలేదని ఈ సందర్భంగా పాటిల్ పేర్కొన్నారు. మంత్రి కాల్వ మెరుగైన పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. పాటిల్ కుటుంబం రాకతో టీడీపీకి అదనపు బలం చేకూరినట్టు అయిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

  • Loading...

More Telugu News