nagashaurya: అవసరాల స్టైల్లోనే నాగశౌర్య కొత్త సినిమా టైటిల్

  • దర్శకుడిగా అవసరాల నుంచి మరో మూవీ 
  • నాగశౌర్య జోడీగా మాళవిక నాయర్ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు    

నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా అవసరాల శ్రీనివాస్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక వైపున యూత్ ను .. మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించేలా ఆయన కథలు ఉంటాయి. అలాగే ఆయన మరో కథను తయారు చేసుకుని, సెట్స్ పైకి వెళ్లడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. నాగశౌర్య - మాళవిక నాయర్ ను నాయకా నాయికలుగా ఎంచుకున్నాడు.

కథాకథనాలను బట్టి ఈ సినిమాకి 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి' అనే టైటిల్ ను సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఈ టైటిల్ ఓకే అయిపోయినట్టేనని అంటున్నారు. గతంలో అవసరాల .. నాగశౌర్య కాంబినేషన్లో 'ఊహలు గుసగుసలాడే'.. 'జ్యో అచ్యుతానంద' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.

More Telugu News