Tamilnadu: కోలీవుడ్ లో వివాదం... మద్యం మత్తులో మరో నటుడిని కొట్టిన విమల్!

  • విరుగంబాక్కంలో ఘటన
  • మద్యం తాగి వచ్చిన విమల్, అతని స్నేహితులు
  • మరో నటుడు అభిషేక్ పై దాడి
తమిళనాడులో మద్యం మత్తులో ఇద్దరు నటులు కొట్టుకున్న ఘటనపై పోలీసు కేసు నమోదైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 'అవన్ ఇవళ్ ఆదు' చిత్రంలో నటించిన అభిషేక్ అనే నటుడు విరుగంబాక్కంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు. తమ అపార్ట్ మెంట్ పైకి ఎక్కిన అతను ఫోన్ లో మాట్లాడుకుంటున్న వేళ, నటుడు విమల్ మద్యం మత్తులో నలుగురు అనుచరులతో కలిసి అక్కడికి వచ్చాడు.

ఆపై ఇక్కడ కాసేపు కూర్చోవచ్చా? అని అభిషేక్ ను ప్రశ్నించగా, భవనం యజమానిని తాను కాదని, తనకు సంబంధం లేదని చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్యా వాగ్వాదం జరుగగా, విమల్ తన అనుచరులతో కలిసి అభిషేక్ పై దాడి చేశాడు. దీంతో గాయాలపాలైన అభిషేక్ వడపళని ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది, విమల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును విచారిస్తున్నామని, విమల్ ను ప్రశ్నించాల్సివుందని పోలీసులు తెలిపారు. 
Tamilnadu
Kollywood
Vimal
Abhisheik

More Telugu News