hebah patel: మరోసారి హాట్ గా కనిపించనున్న హెబ్బాపటేల్

  • ప్రిన్స్ హీరోగా 'రాడికల్' మూవీ 
  • దర్శకుడిగా సుశాంత్ రెడ్డి 
  • త్వరలోనే సెట్స్ పైకి  

రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో సందడి చేస్తూ హెబ్బా పటేల్ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కాస్త కలర్ తక్కువైనా కుర్రకారు మనసులను పొలోమంటూ దోచేసుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయాయి.

ఇటీవల వచ్చిన '24 కిస్సెస్'లో ఆమె ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. పోస్టర్స్ చూసినవాళ్లంతా హెబ్బా పటేల్ కి ఈ సినిమా మరిన్ని చాస్సులు తీసుకొస్తుందనే అనుకున్నారు. కానీ ఆ సినిమా పరాజయంపాలు కావడంతో, సహజంగానే గ్యాప్ వచ్చింది. తాజాగా ఆమె మరోసారి అందాలు ఆరబోయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా 'రాడికల్' అనే ఒక సినిమా సెట్స్ పైకి వెళుతోంది. ఈ సినిమాలో కథానాయికగా హెబ్బా పటేల్ ను ఎంపిక చేసుకున్నారు. రొమాంటిక్ సీన్స్ పుష్కలంగా వున్న ఈ పాత్ర, తన క్రేజ్ ను మరింత పెంచుతుందని హెబ్బా పటేల్ భావిస్తోందట.

  • Loading...

More Telugu News