babuloo Prudhvi Raj: 'పెళ్లి' హిట్ తరువాత వెంటనే అవకాశాలు రాలేదు: పృథ్వీరాజ్

  • 'పెళ్లి' నా మొదటి సినిమా 
  • కోడి రామకృష్ణగారు ఫస్టు ఛాన్స్ ఇచ్చారు 
  • ఆ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది    
తెలుగు తెరపై హీరోగా .. విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పృథ్వీరాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ పాత్రను ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోతూ .. తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత. అలాంటి పృథ్వీరాజ్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించాడు.

" తెలుగులో నా తొలి సినిమా 'పెళ్లి' .. కోడి రామకృష్ణగారు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అయితే గమ్మత్తేమిటంటే ఆ తరువాత మూడు .. నాలుగు నెలల వరకూ ఒక్క అవకాశం కూడా రాలేదు. నేను వెళ్లి కలిసినా .. 'పెళ్లి'లో అద్భుతంగా చేశావంటున్నారేగానీ, అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. అంత మంచి పాత్ర చేసిన తరువాత మళ్లీ నాకు మరో అవకాశం రావడానికి అంత సమయం పట్టడం ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
babuloo Prudhvi Raj
ali

More Telugu News