EC: ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ

  • హస్తినకు చేరిన ఓట్ల తొలగింపు వివాదం 
  • వీవీ ప్యాట్‌లను కూడా లెక్కించాలంటున్న టీడీపీ 
  • ఎన్నికల సంఘంతో వైసీపీ నేతలు కూడా భేటీ 
ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం హస్తినకు చేరింది. నేడు కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, కనకమేడల రవీంద్ర కుమార్, నక్కా ఆనందబాబు, కంభంపాటి రామ్మోహన్‌రావు భేటీ అయ్యారు. ఏపీ ఓట్ల తొలగింపు.. ఫారం - 7, డేటా చోరీపై ఫిర్యాదుతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో వీవీ ప్యాట్‌లను కూడా లెక్కించాలనే డిమాండుతో ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉంచితే, మరోపక్క, కేంద్ర ఎన్నికల సంఘంతో మరికాసేపట్లో వైసీపీ నేతలు కూడా భేటీ కానున్నారు. వీరు కూడా ఫారం - 7కు సంబంధించిన అంశంపైనే ఈసీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
EC
Kalva Srinivasulu
Kanakamedala Ravindra kumar
Nakka Anandababu
Kambhampati Rammohan Rao

More Telugu News