sumanth ashwin: 'ప్రేమకథా చిత్రమ్ 2' విడుదల తేదీ ఖరారు

  • హారర్ థ్రిల్లర్ గా 'ప్రేమకథా చిత్రమ్ 2'
  • ప్రధాన పాత్రధారిగా నందిత శ్వేత
  • ఏప్రిల్ 6వ తేదీన భారీ విడుదల

తెలుగులో వచ్చిన హారర్ కామెడీ చిత్రాలలో 'ప్రేమకథా చిత్రమ్' స్థానం ప్రత్యేకం. యూత్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. భారీ వసూళ్లతో ఈ సినిమా సుధీర్ బాబుకి మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'ప్రేమకథా చిత్రమ్ 2' నిర్మితమైంది. సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా .. నందిత శ్వేత నాయికగా ఈ సినిమా రూపొందింది.

సుదర్శన్ రెడ్డి నిర్మాతగా .. హరికిషన్ దర్శకుడిగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో దెయ్యం పాత్రలో నందిత శ్వేత అదరగొట్టేసింది. దాంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. ప్రేమకథతో ముడిపడిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకూ భయపెడుతుందో చూడాలి.

More Telugu News