vangaveeti: చంద్రబాబుతో భేటీ కానున్న వంగవీటి

  • టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా
  • పార్టీలో చేరికపై చంద్రబాబుతో చర్చ
  • తేదీని ఖరారు చేసే అవకాశం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఈరోజు భేటీ కానున్నారు. టీడీపీలో చేరికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీలో చేరే తేదీని ఖరారు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు విజయవాడలో ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

వైసీపీని వీడిన తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన మౌనంగా ఉండిపోవడంతో... టీడీపీలో చేరడం లేదా? మరో పార్టీలో చేరుతారా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో, చంద్రబాబుతో భేటీ కానుండటంతో... టీడీపీలో చేరనున్నారనే విషయం క్లియర్ అయింది.
vangaveeti
radha
Chandrababu
Telugudesam

More Telugu News