Hyderabad: ‘మా’ ఎలక్షన్స్ ..లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సినీనటుడు కృష్ణ

  • ముగిసిన ‘మా’ ఎన్నికలు
  • ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటులు
  • ఓటు వేసేందుకు కృష్ణ వెళుతుండగా ఆగిన లిఫ్ట్
కొద్ది సేపటి క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఫిలింగనగర్ లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును టాలీవుడ్ నటీనటులు పలువురు వినియోగించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య విజయనిర్మల కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, పోలింగ్ కేంద్రానికి లిఫ్ట్ లో కృష్ణ వెళుతుండగా అది మొరాయించింది. కొద్ది సేపటి తర్వాత పరిస్థితి చక్కబడటంతో ఓటు వేసేందుకు కృష్ణ వెళ్లారు.
Hyderabad
MAA
Film nagar
super star
krishna

More Telugu News