vijayashanthi: విజయశాంతి అలా మాట్లాడి ఉంటే.. అది చాలా తప్పు: రేణుకా చౌదరి

  • మోదీని ఉగ్రవాది అన్న విజయశాంతి
  • ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్న రేణుకా చౌదరి
  • భాష సక్రమంగా ఉండాలని వ్యాఖ్య

శంషాబాద్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉగ్రవాది అంటూ విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యురాలు రేణుకా చౌదరి స్పందించారు. తాను ఆ సభకు హాజరు కాలేదని... విజయశాంతి ఏం మాట్లాడారో తనకు తెలియదని చెప్పారు. ఒకవేళ ఆమె అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే మాత్రం తప్పేనని అన్నారు. ప్రధానమంత్రి స్థానంలో ఎవరు ఉన్నా... వారిపై ఉపయోగించే భాష సక్రమంగా ఉండాలని చెప్పారు. ప్రధాని మనకు నచ్చకపోయినా... వారి గురించి నీచంగా మాట్లాడకూడదని అన్నారు. 

  • Loading...

More Telugu News