india: సరిహద్దులు దాటిన వ్యక్తిని పాకిస్థాన్ కు అప్పగించిన భారత జవాన్లు

  • పొరపాటున సరిహద్దును దాటిన 60 ఏళ్ల వ్యక్తి
  • అదుపులోకి తీసుకుని విచారించిన బీఎస్ఎఫ్
  • అనంతరం పాక్ సైనికులకు అప్పగింత
భారత జవాన్లు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. పాక్ భూభాగం నుంచి పొరపాటున సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశించిన ఓ వ్యక్తిని... సురక్షితంగా పాక్ సైనికులకు బీఎస్ఎఫ్ జవాన్లు అప్పగించారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద శాంతి, సుస్థిరతను కొనసాగించడానికి ఇది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా జవాన్లు తెలిపారు.

పాక్ కు చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి శుక్రవారం జమ్ముకశ్మీర్ లోని సాంబా జిల్లాలో సరిహద్దులు దాటాడు. అతన్ని గుర్తించిన భద్రతాబలగాలు, వెంటనే అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం అతన్ని విచారించగా, పొరపాటున సరిహద్దు దాటానని చెప్పాడు. దీంతో, నిన్న పాకిస్థాన్ సైనికులకు అతన్ని బీఎస్ఎఫ్ అప్పగించింది.
india
Pakistan
boarder
cross
man
bsf

More Telugu News