అనంతపురంలో అర్ధరాత్రి భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!

10-03-2019 Sun 10:30
  • జిల్లాలోని ఉరవకొండ మండలంలో ఘటన
  • భారీ శబ్దంతో కంపించిన భూమి
  • రాత్రంతా ఇళ్ల బయటే గడిపిన గ్రామస్తులు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని ఉరవకొండ మండలం అమిద్యాలలో రాత్రి 12.45 గంటలకు భూమి కొన్ని సెకన్ల పాటు తీవ్రంగా కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రతకు చాలా ఇళ్లకు పగుళ్లు వచ్చాయి.

ఇళ్లన్నీ కొద్దిసేపు ఊగిపోవడంతో గ్రామస్తులు భయాందోళనలకు లోనయ్యారు. చాలామంది రాత్రంతా ఇళ్ల బయటే గడిపారు. ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ఇలాంటి ప్రకంపనలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. అర్ధరాత్రి పెద్ద శబ్దంతో ఈ ప్రకంపనలు వచ్చాయన్నారు.