maa: కొనసాగుతున్న 'మా' పోలింగ్.. ఓటు వేసిన పలువురు సినీ నటులు

  • ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం
  • సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు
  • అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా, నరేష్ ల మధ్య పోటీ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పాలకవర్గం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలవరకు కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో 745 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అసోసియేషన్ అధ్యక్ష పదవికి శివాజీరాజా, నరేష్ లు పోటీ పడుతున్నారు.

మరోవైపు ఇప్పటి వరకు శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, వేణు మాధవ్, బ్రహ్మాజీ, బెనర్జీ, రాజ్ తరుణ్, తనీష్, సాయి ధరమ్ తేజ్, నరేష్, జీవిత, రాజశేఖర్, శివ బాలాజీ, మధుమిత, వెన్నెల కిషోర్, జేడీ చక్రవర్తి, ఝాన్సీ, సునీల్, ప్రియమణి, సుమ, డైరెక్టర్ రవిబాబు సహా పలువురు నటీనటులు ఓటు వేశారు.
maa
polling
tollywood

More Telugu News