Telangana: ఉత్తర కర్ణాటకలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో నేడు అక్కడక్కడ వర్షాలు

  • వర్షాలు పడని చోట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
  • రేపటి నుంచి మరింత ముదరనున్న ఎండలు
  • వాతావరణ శాఖ హెచ్చరిక
ఉత్తర కర్ణాటక ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో వర్షాలు పడని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

కాగా, శనివారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలను చూసుకుంటే.. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్‌లో 38.4 డిగ్రీలు, భద్రాచలంలో 37, హైదరాబాద్‌లో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Telangana
Rains
Karnataka
Hyderabad
temperatures

More Telugu News