Rajanna Sircilla District: ఎంపీటీసీ భర్త కిడ్నాప్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం

  • బయటకు వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో ఆందోళన
  • రూ.25 లక్షలు ఇవ్వాలంటూ కిడ్నాపర్ల నుంచి ఫోన్
  • పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబ సభ్యులు
ఎంపీటీసీ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతోంది. కోనరావుపేట మండలంలోని పేటకు చెందిన ఎంపీటీసీ శివమ్మ భర్త అశోక్ శనివారం పనిమీద బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఈలోగా గుర్తు తెలియని వ్యక్తులు శివమ్మ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అశోక్‌ను విడిచిపెట్టాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అతడిని చంపేస్తామని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు వెంటనే కోనరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
Rajanna Sircilla District
Konarao pet
kidnap
MPTC
Telangana

More Telugu News