Japan: జపాన్ బామ్మ 116 నాటౌట్... గిన్సిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం

  • ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కురాలిగా గుర్తింపు
  • ఇప్పటికీ తగ్గని చురుకుదనం
  • వందేళ్లు పైబడినా సంపూర్ణ ఆరోగ్యం

జపాన్ కు చెందిన కానే తనాకా అనే బామ్మ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఎందుకంటే, ప్రస్తుతం జీవించి ఉన్నవాళ్లలో ప్రపంచంలోకెల్లా పెద్ద వయస్కురాలు తనాకానే. ఆమె వయస్సు 116 సంవత్సరాలు. జపాన్ లోని ఫుకువొకా ప్రాంతంలో నివసించే కానే తనాకా శతాధిక వృద్ధురాలిగా జపాన్ లో ఎంతో ప్రాచుర్యం అందుకుంది.

తనాకా 1903 జనవరి 2న జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు ఎనిమిదిమంది సంతానం కాగా కానే తనాకా ఏడవది. ఆమె 1922లో హిదియో తనాకాను వివాహం చేసుకుంది. తనాకా దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. అయితే మరో నలుగురు పిల్లలను దత్తత తీసుకున్నారట. 116 ఏళ్ల వయసులోనూ ఒథెల్లో అనే బోర్డు గేమ్ ను చక్కగా ఆడుతుంది. అంతేకాదు, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న తనాకా బామ్మగారిని గిన్నిస్ బుక్ ప్రతినిధులు స్వయంగా కలిసి రికార్డు పత్రాన్ని అందజేశారు. దాంతోపాటే ఓ చాక్లెట్ బాక్స్ ను కూడా బహూకరించారు.

More Telugu News