Andhra Pradesh: ఏపీ ‘జీరో కరప్షన్’ రాష్ట్రమట..నిరూపిస్తే రాజీనామా చేస్తా: టీ-మంత్రి తలసాని

  • చంద్రబాబు నీతిపలుకులు పలుకుతున్నారు
  • ఈ విషయమై అక్కడి ప్రజలనే అడుగుదాం
  • ఏపీలో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కమీషన్లు తప్పవు
ఏపీ ‘జీరో కరప్షన్’ రాష్ట్రమంటూ చంద్రబాబు నీతిపలుకులు పలుకుతున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై అక్కడి ప్రజలనే అడుగుదామని, అవినీతి లేని రాష్ట్రమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని తలసాని సవాల్ విసిరారు.

ఏపీలో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా పది శాతం కమీషన్లు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు వెయ్యికోట్ల రూపాయలు పంపామని చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలకు చెందిన సొమ్ము కోట్లాది రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
talasani

More Telugu News