prudhvi: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో అన్నీ నిజాలే ఉంటాయన్న నమ్మకం ఉంది: కమెడియన్ పృథ్వీ

  • 'కథానాయకుడు'లో బాలకృష్ణ బాగా చేశారు
  • 'మహానాయకుడు'లో ఎన్టీఆర్ కనిపించలేదు
  •  'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నేను చేయవలసింది      

నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన పృథ్వీ, ఇటీవలే రాజకీయాలలోను బిజీ అయ్యారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ బయోపిక్ గురించి తన మనసులోని మాటను చెప్పారు. 'కథానాయకుడు'లో బాలకృష్ణ 32 గెటప్స్ లో కనిపించారు .. ఆ పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించారు. 'మహానాయకుడు' సినిమా దగ్గరికి వచ్చేసరికి, అందులో ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు. వియ్యంకుడైన చంద్రబాబు నాయుడిని మంచివాడిగా చూపించడం కోసం 'మహానాయకుడు' తీశారు.

ఆ పాత్రను రానా చేశాడట .. నేను చూడలేదు. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరించారనే విషయం అందరికీ తెలిసిందే. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో నిజాలు చూపిస్తారనే నమ్మకం నాకుంది. ఈ సినిమా ట్రైలర్ ను వదిలిన ఒక గంటలోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. రామారావుగారి జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచే కథ నడుస్తుంది .. అసలు ఇందులో ఎన్టీఆర్ గా నేను చేయవలసింది .. కొద్దిలో మిస్సయ్యాను" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News