Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం.. కృష్ణా నదిలో ఈతకెళ్లి 9వ తరగతి విద్యార్థి మృతి!
- పెనుమూడిలో ఈతకు వెళ్లిన ఇద్దరు పిల్లలు
- నీటిలో మునిగిపోయి ఒకరి దుర్మరణం
- విషాదంలో మునిగిపోయిన బాలుడి తల్లిదండ్రులు
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి రేపల్లె మండలం పెనుమూడి గ్రామానికి చెందిన ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లి మునిగిపోయారు. దీన్ని దూరం నుంచి గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని నరసింహా అనే బాలుడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ప్రణీతం(14) అనే విద్యార్థి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ బాలుడి మరణంతో అతని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.