అమ్మవారి ఆవాహన కోసం 20 అడుగుల కర్రనెక్కిన పూజారి.. జారిపడి మృతి!

09-03-2019 Sat 11:49
  • కోయంబత్తూరు సమీపంలో సండముత్తూరు అమ్మవారు
  • 20 అడుగుల ఎత్తయిన కర్రను ఎక్కి అమ్మమాటను చెప్పిన పూజారి
  • ప్రమాదవశాత్తూ కిందపడి మృతి

తమిళనాడు, కోయంబత్తూరు జిల్లా పోరూరులో ఉన్న సండముత్తూరు ఆలయ ఉత్సవాల్లో అపశ్రుతి దొర్లింది. ఇక్కడి గ్రామ దేవత ఆలయ పూజారీ, ప్రతి సంవత్సరం అమ్మను ఆవహించుకుని, 20 అడుగుల ఎత్తయిన కర్రను ఎక్కి, అమ్మ మాటలను వినిపించడం ఆనవాయితీ. ఈ క్రమంలో పూజారి చేసే విన్యాసాలను తిలకించేందుకూ భక్తులు పెద్దఎత్తున తరలి వస్తుంటారు. ఈ క్రమంలో నిన్న రాత్రి వాక్కు చెప్పే కార్యక్రమం జరుగగా, పూజారి అయ్యస్వామి కర్రపైకి ఎక్కి, ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తల నేలకు తాకగా, బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం వీడియో తమిళనాట వైరల్ అవుతోంది.