dil raju: దిల్ రాజు బ్యానర్లో మరో రెండు సినిమాలు చేయనున్న అనిల్ రావిపూడి?

  • అనిల్ రావిపూడితో వరుస సినిమాలు 
  • దిల్ రాజుకు భారీ లాభాలు 
  • అనిల్ రావిపూడిపై మరింతగా పెరిగిన నమ్మకం 

నిర్మాతగా దిల్ రాజుకి ఎంతో అనుభవం వుంది. ఏ వర్గం ప్రేక్షకులకు ఏ తరహా కథలు కావాలనేది ఆయనకి బాగా తెలుసు. అలాగే ఏ కథలను ఏ దర్శకుడు తెరపై ఎలా ఆవిష్కరిస్తాడనేది కూడా ఆయనకి తెలుసు. అలా ఆయన 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' సినిమాలను దర్శకుడు అనిల్ రావిపూడితో చేశారు. ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో, 'ఎఫ్ 2' సినిమాను కూడా అనిల్ రావిపూడితోనే నిర్మించాడు.

ఈ సినిమా ఒక రేంజ్ లో భారీ వసూళ్లను తీసుకురావడంతో, మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి చేయనున్న సినిమా కోసం కూడా తానే నిర్మాతగా మారిపోయాడు. ఇక ఈ సినిమానే కాకుండా తన బ్యానర్లో మరో రెండు సినిమాలు చేసేలా అనిల్ రావిపూడితో దిల్ రాజు ఒప్పందం చేసుకున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం వుంది. 

  • Loading...

More Telugu News