హైదరాబాద్ లో... యువతిని వివస్త్రను చేసిన కామాంధులు... చావగొట్టిన అమ్మాయి ఫ్రెండ్స్!
- అమ్మాయికి మత్తుమందు అలవాటు చేసిన యువకులు
- కన్నేసిన మరో బ్యాచ్
- మీడియాలో వివస్త్రను చేస్తున్న దృశ్యాలు
ఇటీవల గంజాయి మత్తులో ఉన్న ఆమెను యువకులు వదిలి వెళ్లడంతో, ఆమెపై కన్నేసిన మరో బ్యాచ్ వచ్చి, వివస్త్రను చేసి అత్యాచారయత్నం చేసింది. తమతో పాటు తమ ఫ్రెండ్ రాలేదని తెలుసుకున్న యువకులు తిరిగి ఆమెను వదిలిన ప్రాంతంలోకి రాగా, ఈ విషయాన్ని గమనించిన ఆ బ్యాచ్, ఆమెను బ్లేడ్ తో కోశారు. ఆపై వారు పరారవుతుండగా, కొందరిని పట్టుకున్న యువతి స్నేహితులు వారిని చితక కొట్టినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. యువతిని వివస్త్రను చేస్తున్న దృశ్యాలను మరో యువకుడు వీడియో తీయగా, అవి మీడియాకు చిక్కాయి.