Ranchi: రాంచీ వన్డేలో ఆస్ట్రేలియా విజయం.. పోరాడి ఓడిన భారత్

  • భారత్ పై 32 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
  • టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు
  • భారీ విజయలక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత్

రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ పై 32 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 314 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు చెలరేగి ఆడింది. భారీ విజయలక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, కోహ్లీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజాలు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లినప్పటికీ భారత్ కు విజయం దక్కలేదు. కాగా, ఐదు వన్డేల సిరీస్ లో 2-1 ఆధిక్యంలో భారత్ నిలిచింది.

స్కోర్లు:  ఆస్ట్రేలియా- 313/5, భారత్ 281 ఆలౌట్

ఆసీస్ బ్యాటింగ్: ఖవాజా-104, ఫించ్- 93, మ్యాక్స్ వెల్- 47, స్టాయినిస్-31  
భారత్ బౌలింగ్: కుల్ దీప్ యాదవ్ -3, షమీ-1

భారత్ బ్యాటింగ్: విరాట్ కోహ్లీ -123, శంకర్-32,ధోని-26, జాదవ్-26  
ఆస్ట్రేలియా బౌలింగ్: జంపా -3, కమిన్స్-2, రిచర్డ్ సన్- 2, లియన్ -1 

More Telugu News