Ponnam Prabhakar: పొన్నం ఒక రాజకీయ వ్యభిచారి.. కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు: గంగుల కమలాకర్

  • కాంగ్రెస్ నుంచి గెంటేయాలి
  • పెద్ద పోటుగాడివని ఎంపీగా పోటీ చేస్తున్నావా?
  • పొన్నం మరో కేఏ పాల్..

కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొన్నం తెలంగాణకు మరో కేఏ పాల్ అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కాలి గోటికి కూడా పొన్నం సరిపోడని.. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి మెడపట్టి గెంటేయాలన్నారు. పెద్ద పోటుగాడివని మళ్లీ కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తున్నావా? అంటూ విరుచుకుపడ్డారు. ఆయనది ఎంపీ స్థాయి కాదని.. కార్పోరేటర్ స్థాయి అంటూ కమలాకర్ ఎద్దేవా చేశారు. పొన్నం ఓ రాజకీయ వ్యభిచారి అని.. ఇప్పటి వరకూ ఆయన ఐదు సార్లు పోటీ చేస్తే ఒక్కసారే గెలిచారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News