mig 21: కుప్పకూలిన మిగ్-21 యుద్ధ విమానం

  • రాజస్థాన్ లో కూలిపోయిన మిగ్
  • ప్యారాచూట్ ద్వారా సురక్షితంగా బయటపడ్డ పైలట్
  • ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం
భారత వాయుసేనకు చెందిన మరో మిగ్ యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ లోని బికనీర్ సిటీకి సమీపంలో మిగ్-21 కూలిపోయింది. అయితే, విమానం నుంచి పైలట్ సురక్షితంగా ప్యారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యాడు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మిగ్ విమానం ఎన్ఏఎల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయింది. అనంతరం 14 కిలోమీటర్ల దూరంలో శోభాసర్ గ్రామం వద్ద కూలిపోయింది. ఘటన జరిగిన వెంటనే వాయుసేనకు చెందిన ఓ బృందం హుటాహుటిన అక్కడకు చేరుకుంది. విమానం కూలిపోవడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
mig 21
crash
rajasthan
bikanir
indian air force

More Telugu News