Andhra Pradesh: ఫారం-7 దుర్వినియోగంపై ఏర్పాటైన సిట్ తో ఈసీకి సంబంధం లేదు: సీఈఓ ద్వివేది

  • కేసుల దర్యాప్తు వ్యవహారం పోలీసులు చూసుకుంటారు
  • ప్రత్యర్థుల అనుకూల ఓట్లను తొలగించే ప్రక్రియను తొలిసారి గుర్తించాం
  • గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు

ఏపీలో ఫారం-7 దుర్వినియోగంపై ఏర్పాటైన సిట్ తో ఈసీకి సంబంధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసుల దర్యాప్తు వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని అన్నారు. ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసి ప్రత్యర్థుల అనుకూల ఓట్లను తొలగించే ప్రక్రియను తొలిసారి గుర్తించామని, గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని అన్నారు. దీనివల్ల, ఫారం-7 పరిశీలనకు ఎక్కువ సమయాన్ని ఎన్నికల సిబ్బంది కేటాయించాల్సి వస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశామని ద్వివేది తెలిపారు.

More Telugu News