Andhra Pradesh: తెలంగాణ, ఏపీ సిట్ లు పోటాపోటీగా ఏర్పాటయ్యాయని భావించట్లేదు: ఏపీ సిట్ ఇన్ ఛార్జి బాలసుబ్రహ్మణ్యం

  • ఏపీ సిట్ డేటా చోరీ అంశంపైనే దృష్టి పెట్టింది
  • డేటా చోరీ జరిగిందా? లేదా? అని తొలుత విచారిస్తాం
  • ఆధారాల మేరకు విచారణలో ముందుకెళ్తాం

తెలంగాణ, ఏపీ సిట్ లు పోటాపోటీగా ఏర్పాటయ్యాయని భావించడం లేదని డేటా చోరీ అంశంపై ఏపీ ఏర్పాటు చేసిన సిట్ ఇన్ చార్జి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ డేటా చోరీ అంశంపైనే దృష్టి పెట్టిందని, డేటా చోరీ జరిగిందా లేదా అనేది తొలుత విచారిస్తామని, ఆధారాలను అనుసరించి విచారణలో ముందుకు వెళ్తామని చెప్పారు.

 ఆధారాలను పరిశీలించడం ద్వారా ఎవరి పాత్ర ఏమిటో తెలుస్తుందని, సిట్ బృందంతో సమావేశం తర్వాత మరింత ముందుకు వెళ్తామని బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఏపీ డీజీపీ కార్యాలయంలోనే సిట్ కార్యాలయం ఏర్పాటు చేశారని, తనతో పాటు నలుగురు సభ్యులు వచ్చారని, ఇంకా నలుగురు రావాల్సి ఉందని చెప్పారు. రేపటికల్లా ఆ నలుగురు సభ్యులు తమతో జాయిన్ అవుతారని చెప్పిన బాలసుబ్రహ్మణ్యం, డేటా చోరీ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం తమకు చెప్పినట్టు పేర్కొన్నారు.

More Telugu News