Mahesh Babu: 'కేజీఎఫ్' దర్శకుడితో మహేశ్ బాబు?

  • 'కేజీఎఫ్' దర్శకుడికి కబురు 
  • లైన్ వినేసిన నమ్రత 
  • పూర్తి కథపై కసరత్తు
సుకుమార్ తో చేయాలనుకున్న ప్రాజెక్టు చివరి నిమిషంలో పక్కకి పోవడంతో, మహేశ్ బాబు ఆలోచనలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఒక దర్శకుడితో ఒక ప్రాజెక్టును గురించి మాత్రమే చర్చిస్తూ కూర్చుంటే, ఆ ప్రాజెక్టు ఆగిపోతే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన మహేశ్ బాబు .. ఇద్దరు ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా చెప్పుకున్నారు.

అందులో భాగంగానే 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కి కబురు వెళ్లడం .. ఆయన వచ్చి మహేశ్ శ్రీమతి నమ్రతకి లైన్ వినిపించడం జరిగిపోయాయట. ప్రశాంత్ నీల్ చెప్పిన లైన్ నమ్రతకి నచ్చిందట. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని ఆమె చెప్పినట్టుగా సమాచారం. త్వరలోనే ఆయన పూర్తి కథను మహేశ్ బాబుకి వినిపించనున్నాడని అంటున్నారు. మహేశ్ బాబుకి కథ నచ్చితే, ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందన్న మాట.
Mahesh Babu
prashanth neel

More Telugu News