mizoram: మిజోరాం గవర్నర్ రాజీనామా

  • గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రాజశేఖరన్
  • ఆమోదించిన రాష్ట్రపతి కోవింద్
  • తాత్కాలిక గవర్నర్ గా అసోం గవర్నర్ కు బాధ్యతల అప్పగింత
మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. మరోవైపు, అసోం గవర్నర్ జగదీష్ ముఖిని మిజోరాం తాత్కాలిక గవర్నర్ గా నియమించారు. మిజోరాంకు కొత్త గవర్నర్ ను నియమించేంత వరకు జగదీష్ ఈ రాష్ట్ర కార్యకలాపాలను కూడా పర్యవేక్షించనున్నారు. ఆర్ఎస్ఎస్ కు ఎంతో కాలం సేవలందించిన రాజశేఖరన్ ను 2018 మే 25న మిజోరాం గవర్నర్ గా నియమించారు. రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
mizoram
governor
kummanam rajasekharan
resign

More Telugu News