Sadhineni Yamini: చంద్రబాబుకు మహిళలంతా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు!: సాధినేని యామిని

  • 'పసుపు-కుంకుమ' ద్వారా మహిళల మనసు గెలుచుకున్నారు
  • తిరిగి సీఎంను చేయడం ద్వారా మహిళలు బహుమతి ఇస్తారు
  • టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని
ఎంతో అద్భుతమైన 'పసుపు-కుంకుమ' పథకం ద్వారా లక్షల మంది మహిళల మనసులను చంద్రబాబునాయుడు గెలుచుకున్నారని, వారంతా తమ నేతను తిరిగి సీఎంను చేయడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, వైఎస్ జగన్ మహిళా ద్రోహని, ఆయనకు తెలుగు ఆడపడుచులు తగిన గుణపాఠం చెప్పనున్నారని ఆయన కోసం చెంపపెట్టులాంటి సమాధానాన్ని సిద్ధం చేసుకున్నారని అన్నారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను టీడీపీ సర్కారు ప్రవేశపెట్టిందని, ఈ క్షణం మహిళాలోకం యావత్తూ చంద్రబాబుకు అండగా నిలిచిందని అన్నారు.

మడమ తిప్పడంలో ముందున్న పార్టీ వైసీపీయేనని, పక్క రాష్ట్రంలోని కేసీఆర్, కేంద్రంలోని దుర్మార్గుడైన మోదీతో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శలు గుప్పించారు.
Sadhineni Yamini
Chandrababu
Return Gift

More Telugu News