ఉదయాన్నే జగన్ ఇంటికి వచ్చి పార్టీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్!
- లోటస్ పాండ్ లో వైసీపీలో చేరిన బాలవర్ధన్
- జగన్ ఏ పని చెప్పినా చేసేందుకు సిద్ధమని వెల్లడి
- గన్నవరం ప్రాంతంలో పార్టీ పట్టు పెరిగిందన్న జగన్
ఈ సందర్భంగా బాలవర్ధన్ రావు మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో ఇప్పుడు భయానక వాతావరణం నెలకొందని, ప్రజల కష్టసుఖాలు వినేవారే లేరని అన్నారు. తన కార్యకర్తలు, గన్నవరం ప్రజల మేలు కోసం వైసీపీలో చేరుతున్నానని, ఈ సందర్భంగా ఎటువంటి కోరికలనూ తాను కోరలేదని చెప్పారు. జగన్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆయన ఏది చెబితే అది చేస్తానని అన్నారు. కాగా, దాసరి వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బాలవర్థన్ రావు సోదరుడు దాసరి జై రమేష్ తదితరులు కూడా ఉన్నారు.