dhanush: ధనుశ్ ప్రేమకథా చిత్రం విడుదలకి ముహూర్తం ఖరారు

  • గౌతమ్ మీనన్ తో ధనుశ్
  • త్వరలోనే ట్రైలర్ రిలీజ్
  • ఏప్రిల్ 4వ తేదీన సినిమా విడుదల    
 ప్రేమకథా చిత్రాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించగల దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి పేరు వుంది. ఆయన దర్శకత్వంలో చేయడానికి స్టార్ హీరోలు ఉత్సాహాన్ని కనబరుస్తూ వుంటారు. ధనుశ్ కూడా ఆయన దర్శకత్వంలో 'ఎన్నై నోకి పాయుమ్ తొట్ట' అనే సినిమా చేశాడు. ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమైంది.

గౌతమ్ మీనన్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన షూటింగ్ పరంగా ఆలస్యమైంది. అలాంటి ఈ సినిమా విడుదలకి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ఏప్రిల్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే ట్రైలర్ ను కూడా వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ధనుశ్ జోడీగా మేఘా ఆకాశ్ కనిపించనుంది. తన కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది.
dhanush
megha aaksh

More Telugu News