Konatala Ramakrishna: కొణతాల రామకృష్ణ పార్టీ మార్పుపై వచ్చిన క్లారిటీ!

  • 17న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
  • కొంతకాలంగా తటస్థంగా ఉంటున్న కొణతాల
  • అనకాపల్లి లోక్ సభ సీటు నుంచి పోటీకి చాన్స్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గత కొంత కాలంగా తటస్థంగా ఉన్న కొణతాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 17న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో కొణతాల పచ్చ కండువాను కప్పుకోనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు అనకాపల్లి లోక్ సభ టికెట్ ను కూడా ఇచ్చేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది.

 ఈ స్థానం నుంచి పోటీకి విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌ అయ్యన్న కుమారుడు విజయ్ ఆసక్తి చూపుతుండగా, కొణతాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, ఎంతోమంది నేతలు పార్టలు ఫిరాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు తమ పార్టీలను వదిలి పక్క పార్టీల్లో అవకాశాల కోసం పరుగులు పెట్టగా, అదే దారిలో మరింత మంది ఉన్నారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Konatala Ramakrishna
Telugudesam
Chandrababu
Anakapalli

More Telugu News