Summer: అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ, ఉత్తర కోస్తా!

  • వాయవ్య బంగాళాఖాతం నుంచి ద్రోణి
  • పిడుగులతో కూడిన వర్షాలు
  • ఉష్ణోగ్రతలు పెరిగినా తగ్గనున్న వడగాడ్పుల ప్రభావం

ఎండలు పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వేళ, వాయవ్య బంగాళాఖాతం నుంచి రాయలసీమ, కోస్తా మీదుగా ఆవరించిన ద్రోణి అకాల వర్షాలను కురిపిస్తోంది. ఈ ద్రోణి ప్రభావంతో గురువారం నాడు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి.

ద్రోణి ప్రభావంతో, వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షం పడవచ్చని ఆంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇదిలావుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకూ అధికంగా నమోదయ్యాయి. గత వారంతో పోలిస్తే, వడగాడ్పుల ప్రభావం తగ్గినా, ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది.

  • Loading...

More Telugu News