vijay devarakonda: నాలుగు భాషల్లో రిలీజ్ కానున్న 'డియర్ కామ్రేడ్'

  • ముగింపు దశలో 'డియర్ కామ్రేడ్'
  • ఈ నెల 17న టీజర్ రిలీజ్
  •  మే 22వ తేదీన సినిమా విడుదల  

'గీత గోవిందం' .. 'టాక్సీవాలా' విజయాలతో విజయ్ దేవరకొండ మంచి జోరుమీదున్నాడు. ఆయన తదుపరి చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. షూటింగు పరంగా ఈ సినిమా ముగింపుదశకి చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

విభిన్నమైన ప్రేమ కథాంశంతో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో మే 22వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే టీజర్ ను ఈ నాలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ రిలీజ్ కి ఈ నెల 17వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనున్నారు. 

More Telugu News