Chandrababu: మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు శుభవార్త.. నేడు పసుపు కుంకుమ కింద రూ.3,500 జమ

  • పసుపు-కుంకుమ కింద రెండో విడత రూ.3500 జమ
  • మహిళా సాధికారతకు ఎన్టీఆర్ బాటలు వేశారన్న సీఎం
  • తమ ప్రభుత్వంలో మహిళకు సముచిత స్థానం కల్పించామన్న బాబు

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. పసుపు కుంకుమ కింద ఇప్పటికే రూ.10 వేలు అందించిన ప్రభుత్వం వారి సాధికారత కోసం మరో పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సొమ్ములో రూ.2500ను గత నెలలోనే అందించిన సర్కారు.. నేడు రెండో విడతలో భాగంగా మరో రూ.3500ను వారి ఖాతాల్లో జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారమే సీఎం ఆదేశాలు జారీ చేశారు.

గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిహక్కును తీసుకొచ్చిన ఎన్టీరామారావు మహిళా సాధికారతకు బాటలు వేశారన్నారు. స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగాల్లో మహిళలకు తాము 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్టు చంద్రబాబు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అప్పట్లో శాసనసభకు మహిళను స్పీకర్‌గా చేశామని, కేబినెట్‌లోనూ మహిళకు సముచిత స్థానం కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నా ఇంకా వివక్ష కొనసాగడం విచారకరమన్నారు.

More Telugu News