Guntur District: గోశాలలో.. గో సేవలో.. పవన్ కల్యాణ్.. ఆసక్తికర చిత్రాలు!

  • మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ప్రాంగణంలో గోశాల
  • గోవులకు మేత వేసిన పవన్ కల్యాణ్
  • ‘రైతు జీవితం.. పాడి, పంట కలనేత’ అన్న పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు వ్యవసాయం, రైతులు, పశు సంరక్షణ అన్నా, సంస్కృతీ సంప్రదాయాలను పాటించడం పైన ఆయనకు ఎనలేని మక్కువ, ప్రేమ. ‘రైతు జీవితం.. పాడి, పంట కలనేత’ అని చెప్పే పవన్.. సమయం దొరికినప్పుడల్లా వ్యవసాయం చేయడమే కాదు, గో సేవ కూడా చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే, జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ‘సంస్కృతులను కాపాడే సమాజం’ అన్న అంశాన్ని చేర్చారు. అందుకు నిదర్శనమే.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోశాల. ఈరోజు సాయంత్రం పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్, గోశాలలో గో సేవలో మునిగిపోయారు. గోవులకు మేత వేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Guntur District
mangala giri
jana sena
pawan

More Telugu News