swachh: 'స్వచ్ఛ' ర్యాంకుల్లో పడిపోయిన హైదరాబాద్ స్థానం

  • పరిశుభ్రతలో 35వ స్థానానికి పడిపోయిన హైదరాబాద్
  • గత ఏడాది 27వ ర్యాంకు 
  • ఒక్క అవార్డును కూడా సొంతం చేసుకోలేకపోయిన జీహెచ్ఎంసీ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో హైదరాబాద్ స్థానం దారుణంగా పడిపోయింది. దేశంలోని 100 నగరాల్లో హైదరాబాద్ 35వ స్థానానికి దిగజారింది. గత ఏడాది 27వ స్థానంలో హైదరాబాద్ ఉంది. 2018లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో జీహెచ్ఎంసీకి బెస్ట్ క్యాపిటల్ సిటీ అవార్డు దక్కింది. కానీ, ఏడాది మాత్రం పరిశుభ్రతకు సంబంధించి ఒక్క జాతీయ అవార్డును కూడా జీహెచ్ఎంసీ సొంతం చేసుకోలేక పోయింది. కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతలో నగరానికి త్రీ స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చింది.
swachh
survekshan rankings
hyderabad
ghmc

More Telugu News