kaushal: మీ టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి నన్ను వాడుకోవద్దు: 'బిగ్ బాస్' కౌశల్

  • ఆ రోజునే ఆధారాలన్నీ చూపించాను
  •  నా పిల్లలపై ఈ ప్రభావం పడకూడదు
  •  ఇక వదిలేయండి    

'బిగ్ బాస్ 2'లో కౌశల్ విజేతగా నిలవడానికి కారణమైన కౌశల్ ఆర్మీ, ఆయనపై ఆరోపణలు చేస్తూ మీడియాకెక్కిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను ఖండిస్తూ కౌశల్ కూడా మీడియా ముందుకు వచ్చాడు. అయితే ఈ డిబేట్స్ కారణంగా ఆయా చానల్స్ రేటింగ్స్ పెరగడంతో, మిగతా చానల్స్ వారు అటు కౌశల్ తో .. ఇటు కౌశల్ ఆర్మీ సభ్యులతో డిబేట్స్ పెట్టడానికి ఆసక్తిని చూపుతున్నాయట.

ఈ విషయంపై కౌశల్ స్పందిస్తూ .. "నాపై వచ్చిన సిల్లీ ఆరోపణలకి సంబంధించి మీడియా వారు నన్ను సంప్రదించడం ఆపాలని కోరుతున్నాను. నా దగ్గరున్న ఆధారాలన్నీ ఆ రోజున ప్రెస్ మీట్ లోనే చూపించాను .. నేనేదైనా తప్పుచేస్తే చట్టం నన్ను శిక్షిస్తుంది. నా భార్య ఆరోగ్యం బాగోలేదు .. నాకు నా కుటుంబం ముఖ్యం. నా పిల్లలపై ఈ ప్రభావం పడకుండా చూసుకోవలసిన బాధ్యత నాపై వుంది. అందువలన ఇక నన్ను ఈ వ్యవహారంలోకి లాగొద్దు .. మీ టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి నన్ను వాడుకోవద్దు" అని ఆయన ట్వీట్ చేశాడు

  • Loading...

More Telugu News