surya: హీరోగా సూర్య .. కీలకమైన పాత్రలో మోహన్ బాబు

  • సుధ కొంగర దర్శకత్వంలో సూర్య 
  • మోహన్ బాబుతో సంప్రదింపులు
  •  తెలుగు .. తమిళ భాషల్లో నిర్మాణం

తమిళంలో మణిరత్నం ఒక భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మొదటి రాజ రాజ చోళుని నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అలాంటి ఈ సినిమాలో మోహన్ బాబు ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా ఇటీవలే ఒక వార్త వచ్చింది. ఈ విషయంపై మోహన్ బాబును మణిరత్నం సంప్రదించినట్టుగా చెప్పుకున్నారు.

ఇదిలా ఉంచితే, ఆయన మరో తమిళ సినిమా కూడా చేయనున్నారనేది తాజా సమాచారం. ప్రస్తుతం సూర్య ఒక ప్రాజెక్టు పూర్తవుతుండగానే మరొక ప్రాజెక్టును పట్టాలెక్కిస్తూ బిజీగా వున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సుధ కొంగర దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నాడు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడైన జీఆర్ గోపీనాథ్ జీవితచరిత్రగా ఈ సినిమా రూపొందనుందట. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మోహన్ బాబును సుధ కొంగర సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రూపొందించనున్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News