Andhra Pradesh: డేటా చోరీ క్రిమినల్ నేరం: సీపీఐ నారాయణ

  • ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన డేటా ఇది
  • ఆ డేటా ఓ ప్రైవేట్ సంస్థ వద్ద ఉండటం దారుణం
  • ఈసీ కూడా నిష్పక్షపాతంగా పని చేయట్లేదు

డేటా చోరీ క్రిమినల్ నేరమని, ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన డేటా వేరే వారి వద్ద ఉండకూడదని సీపీఐ నారాయణ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన డేటా ఓ ప్రైవేట్ సంస్థ వద్ద ఉండటం దారుణమని, దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈసీ కూడా నిష్పక్షపాతంగా పని చేయడం లేదని ఆరోపించారు. డేటా చోరీపై సుప్రీంకోర్టు సుమోటాగా కేసు విచారణ చేయాలని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి తాము పోటీ చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

More Telugu News