ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబీఎన్ పై జగన్ బురద చల్లుతున్నారు!: మంత్రి దేవినేని ఉమ
- ఈ మీడియాపై జగన్ దాడి చేస్తున్నారు
- సాక్షిని జగన్ కుటుంబమే నడుపుతోంది
- ఏపీ ప్రతిపక్ష నేతపై మండిపడ్డ మంత్రి దేవినేని
ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాపై దాడిచేసే అధికారం జగన్ కు ఎంతమాత్రం లేదని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. అవినీతి డబ్బుతో సాక్షి పత్రికను, ఛానల్ ను జగన్ కుటుంబమే నడుపుతోందని ఆరోపించారు. దేశంలో, ఏపీలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ పనిచేయడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలు ఓటును నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేవామిత్ర డేటాను తెలంగాణ పోలీసులు తీసుకోవడంపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.