ap: ఏపీలో టీడీపీని కూకటివేళ్లతో పెకిలిస్తాం: బీజేపీ

  • టీడీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తాం
  • రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సిన నాయకుడు దొంగగా మారారు
  • రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
ఏపీలో అవినీతి పార్టీ టీడీపీని కూకటివేళ్లతో పెకిలించేంత వరకు నిద్రపోబోమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి లూటీ శాఖ మంత్రిగా మారారని ఆరోపించారు. రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సిన నాయకుడే దొంగగా మారారని విమర్శించారు. ప్రతిపక్షం ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. డేటా చోరీపై కేంద్ర విచారణ సంస్థలు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు.
ap
bjp
Telugudesam
Vishnu Vardhan Reddy

More Telugu News