Upasana: ఒక్కోసారి భర్త కూడా పప్పులో కాలేస్తాడు: ఉపాసన

  • రేపు మహిళా దినోత్సవం
  • భర్తలు తప్పు చేస్తే సరిచేయాలి
  • నేటి తరం మహిళకు ప్రత్యేకించి కావాల్సిందేమీ లేదన్న ఉపాసన
రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాగా, ఈ సందర్భంగా తనను ఇంటర్వ్యూ చేసిన ఓ టీవీ చానల్ తో మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించిన ప్రతి పురుషుడి వెనుక ఓ స్త్రీ ఉంటుందని చెప్పిన ఆమె, కొన్ని విషయాల్లో భర్తలు తప్పు చేస్తారని, భర్త పప్పులో కాలేసిన వేళ, సరిచేయడమే భార్య విధని చెప్పారు. మహిళలకు ప్రత్యేకంగా కావాల్సినదంటూ ఏమీ లేదని, నేటి తరం మహిళలు అన్ని రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారని, భారత సంస్కృతి, సంప్రదాయాలు అందుకు సహకరిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Upasana
Ramcharan
Womens Day

More Telugu News