అనసూయ 'కథనం' నుంచి టీజర్ వచ్చేస్తోంది
- అనసూయకి మంచి క్రేజ్
- నాయిక ప్రాధాన్యత గల 'కథనం'
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
'మహిళా దినోత్సవం' సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. అనసూయ ఇంతకుముందు చేసిన 'క్షణం' .. 'రంగస్థలం' సినిమాల్లోని పాత్రలు ఆమెకి మంచి పేరును తీసుకొచ్చాయి. ఆమె 'క్షణం' సినిమా చేసినప్పుడే .. నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను అనసూయతో చేసేయవచ్చనే టాక్ వచ్చింది. అలాంటి అవకాశం ఆమెకి 'కథనం'తో వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో అనసూయ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటుందేమో చూడాలి.