balakrishna: బాలకృష్ణ .. బోయపాటి సినిమాను ఆ రోజున లాంచ్ చేస్తారట

  • గతంలో వీరి కాంబోలో 'సింహా' .. 'లెజెండ్'
  • మూడవ సినిమాకి సన్నాహాలు
  • ఎన్నికల తరువాత రెగ్యులర్ షూటింగ్    

బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' భారీ విజయాలను అందుకున్నాయి. మూడవ సినిమా చేయడానికి అవసరమైన ఏర్పాట్లలో బోయపాటి వున్నాడు. ఈ సినిమాకి ముందు బోయపాటి చేసిన 'వినయ విధేయ రామ' భారీ పరాజయాన్ని చవిచూసింది. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ కారణంగా భారీగా నష్టపోయారు.

అందువలన ఈ ప్రాజెక్టు ఉంటుందా .. లేదా అనే సందేహం అందరిలోనూ ఎక్కువవుతోంది. ఈ సందేహానికి తెరదింపాలనే ఉద్దేశంతో బాలకృష్ణ .. బోయపాటి ముందుగా ఈ సినిమాను లాంచ్ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి, ఎన్నికల తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తారా? వేరెవరికైనా అప్పగిస్తారా? అనే విషయంలో క్లారిటీ రావాలసి వుంది.

More Telugu News